రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు గాయాలు

by Batti.Sumithra |

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు గాయాలు
X

దిశ, పేట్‌బషీరాబాద్ : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందంతో కలిసి వరంగల్ జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్‌ను పరిశీలించేందుకు వెళ్తుండగా, యాదాద్రి భువనగిరి జిల్లా వీరా హోటల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాయకుల కాన్వాయ్‌లోని రెండు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన ఛాతి భాగంతో పాటు శరీరంలోని ఇతర భాగాలకు స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అత్యవసర విభాగంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. శంభీపూర్ రాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. విషయం తెలుసుకున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద వెంటనే ఆసుపత్రికి చేరుకుని శంభీపూర్ రాజును పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి ఆయనకు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు.

Next Story