- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందులో డౌటే వద్దు.. అస్సలు తగ్గం: మంత్రి కీలక ప్రకటన
ఏపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా చేపడుతోంది. ఇందులో భాగంగా నిధులు కూడా సమయానికే విడుదల చేస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల నేతలు మొత్తం ఫోకస్ అంతా పెట్టి గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(Ap Government) అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా చేపడుతోంది. ఇందులో భాగంగా నిధులు కూడా సమయానికే విడుదల చేస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల నేతలు మొత్తం ఫోకస్ అంతా పెట్టి గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ జాబితాలో నెల్లూరు(Nellore) జిల్లా కూడా ఒకటి. మంత్రి పొంగూరు నారాయణ(Minsiter Ponguru Narayana) జిల్లాకు సంబంధించిన వ్యక్తే కావడం, సీఎం చంద్రబాబు(Cm Chandrababu)కు అత్యంత సన్నిహితుడు కావడంతో అక్కడి పట్ణణగ్రామాల రూపురేఖలు మారుస్తున్నారు. ప్రతినిత్యం జిల్లాపైనే ఫోకస్ పెట్టి ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టారు. స్కూళ్ల, కాలేజీలు, కాలువను ఆధునీకరిస్తున్నారు.
వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్
తాజాగా కూడా ఆయన నెల్లూరు జిల్లాలోనే పర్యటిస్తున్నారు. నెల్లూరులోని కాలువలు, ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. అలాగే స్థానకంగా ఏర్పాటు చేస్తున్న ఇంటర్నేషనల్ స్కూలు పనులను కూడా పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎస్ఆర్ ఫండ్స్‌తో స్కూళ్లను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. తాను ఇంత అభివృద్ధి చేస్తున్నా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని, వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఆరోపణలను భయపడమని, అలా అని అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వైసీపీ చేస్తున్న చీప్ రాజకీయాలకు అభివృద్ధితోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు.






