- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్‌పై రాజకీయ వేధింపులు ఆపాలి: ఎమ్మెల్సీ
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కక్ష సాధింపు చర్యలకే పరిమితమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. హరీశ్‌రావును, కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ సిట్ నోటీసులు పంపడం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యే అని అన్నారు. బొగ్గు కుంభకోణం మంటల నుండి తన కుర్చీని కాపాడుకోవడానికి రేవంత్‌రెడ్డి ఆడుతున్న డ్రామా అని ఎద్దేవా చేశారు. తన ఒంటికి అంటుకున్న బొగ్గు మరకలను కేటీఆర్‌కు పంపిన నోటీసు కాగితాలతో తుడిచేసుకోవాలని చూడటం ఆయన వెర్రితనమని అన్నారు. వేల కోట్ల రూపాయల బొగ్గు స్కామ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది. దీనిపై ప్రజల్లో జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి, పాతబడి తుప్పు పట్టిన ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని రేవంత్‌రెడ్డి మళ్ళీమళ్ళీ ప్రయోగిస్తున్నారని తెలిపారు. అందుకే ఆయనకు డైవర్షన్ కింగ్ అనే బిరుదు వంద శాతం సరిపోతుంది. ఇప్పటికైనా ఈ చిల్లర రాజకీయాలు, డ్రామాలు కట్టిపెట్టి ప్రజలకు మేలు చేసే పనుల మీద దృష్టి పెట్టాలని హితవు పలికారు.






