- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘శివయ్య మా ఎమ్మెల్యే మనసు మార్చు’.. నీరుకుళ్ళలో వినూత్న కార్యక్రమం
by Jakkula.Mamatha |
ఆత్మకూర్ మండలంలోని నీరుకుళ్ళ గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ సాధన కమిటీ సభ్యులు సోమవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మనస్సు మారాలని తెలంగాణ పబ్లిక్ స్కూల్ నీరుకుళ్ళ లోనే కొనసాగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

X
దిశ, ఆత్మకూర్: ఆత్మకూర్ మండలంలోని నీరుకుళ్ళ గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ సాధన కమిటీ సభ్యులు సోమవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మనస్సు మారాలని తెలంగాణ పబ్లిక్ స్కూల్ నీరుకుళ్ళ లోనే కొనసాగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీరుకుళ్ళ గ్రామంలో స్వయంభుగా వెలసిన శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామికి నీరుకుళ్ళ, పెంచికలపేట, కేశవపురం, గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేరుతో ప్రత్యేక పూజలు అర్చనలు జరిపించి మా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మనస్సు మారాలి. తెలంగాణ పబ్లిక్ స్కూల్ తమ గ్రామం నీరుకుళ్ళ లోనే కొనసాగాలని వేడుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో మానగాని శంకర్, తాటిపర్తి మోహన్ రావు, ఎన్నపురెడ్డి రాజిరెడ్డి, దగ్గు సమ్మారావు, లక్కర్సు రాజశేఖర్, అంకతి రాజకుమార్, తాటిపర్తి సమ్మారావు, వేద పండితులు మధ్య వరం గోపి తదితరులు పాల్గొన్నారు.
Next Story






