- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లిదండ్రులారా జర ఆలోచించండి.. మీ పిల్లల ప్రయాణం సురక్షితమేనా?
తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు.

దిశ, మణుగూరు: తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. ఫీజులు అధిక భారం అయినప్పటికీ తన పిల్లలు చక్కగా చదువుకోవాలని ఆలోచనతో పాఠశాలలకు పంపుతున్నారు. బస్సుల్లో, ఆటోలలో పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను పాఠశాలలకు తీసుకొని వెళుతున్నారు. అయితే పాఠశాలలకు వచ్చే ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నారు. ప్రమాదపు అంచున పాఠశాలకు విద్యార్థుల ప్రయాణం సాగుతుంది. జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు. ఏదైనా ప్రమాదం జరిగే వరకు తీరులో మార్పు రాదా. యాజమాన్యాలకు స్కూల్ ఫీజుల పై ఉన్న శ్రద్ధ పిల్లలపై ఉండదా అంటూ తల్లిదండ్రులు మండి పడుతున్నారు.
తల్లిదండ్రులారా జర ఆలోచించండి..
విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపేటప్పుడు వాహనాల్లో విద్యార్థుల పరిమితి ఎంత ఉందో చూసుకోవాలి. ఒకవేళ పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తే అక్కడే ప్రశ్నించాలి. కానీ పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారని ఆనందపడుతున్నారే తప్ప ప్రమాదాల గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదు. దీంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారే తప్ప విద్యార్థుల గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






