MLA Seethakka: ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం

by GSrikanth |   (  Updated:2022-07-16 11:04:15  IST  )

MLA Seethakka Narrowly Escapes From Boat Accident| కాంగ్రెస్ కీలక నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లోని చాలా గ్రామాలు ముంపునకు గురై వరదల్లో చిక్కుకున్నారు

MLA Seethakka Narrowly Escapes From Boat Accident
X

దిశ, వెబ్‌డెస్క్: MLA Seethakka Narrowly Escapes From Boat Accident| కాంగ్రెస్ కీలక నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లోని చాలా గ్రామాలు ముంపునకు గురై వరదల్లో చిక్కుకున్నారు. చాలా ప్రాంతాల్లో నివాసాలు చెల్లాచెదురై నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో ముంపు ప్రాంతాల్లో నివసిస్తోన్న ప్రజలకు నిత్యావరసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క పడవలో తిరిగి పయణమయ్యారు. ఈ నేపథ్యంలో పడవ వాగులోని ఓ చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. వెంటనే విషయం తెలుసుకున్న అధికారులు మరో పడవలో అక్కడికి చేరుకొని సీతక్కను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు పడవలో ప్రయాణిస్తున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: హస్తం గూటికి పట్నం చేరితే...?

Next Story