- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఘాటు విమర్శలు
జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం భూమిపూజ కార్యక్రమం అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సోమవారం ఘాటుగా స్పందించారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం భూమిపూజ కార్యక్రమం అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సోమవారం ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎంపీ పనుల కంటే మాటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. అవగాహన లేకుండా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తే ఇకపై సహించబోమని హెచ్చరించారు. కేంద్రీయ విద్యాలయం, వాలంటరీ భూమి, యూరియా పంపిణీ వంటి అంశాలపై ఎంపీకి సరైన అవగాహన లేదని ఆరోపించారు. ఏడు సంవత్సరాల ఎంపీ పదవీకాలం తర్వాత ఒక కేంద్రీయ విద్యాలయం తీసుకువచ్చి గొప్పలు చెప్పుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. తాను జగిత్యాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని, తన రాజకీయ జీవితం ప్రజలకు తెలిసిన తెరిచిన పుస్తకమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. సొంత పార్టీలోని సీనియర్ నాయకులను పట్టించుకోని ఎంపీ, ఇతర నాయకులపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ భోగ శ్రావణిని అడ్డుపెట్టుకుని ఎంపీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, నాయకులు అడువాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.






