నాదర్ గుల్ డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే సబితా

by Batti.Sumithra |

సర్కిల్ నాదర్ గుల్ డివిజన్ పరిధిలోని స్వేచ్ఛ నివాస్, సౌభాగ్యపురం, కేఆర్ఆర్ హిల్స్ కాలనీలలో పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బుధవారం పర్యటించారు.

నాదర్ గుల్ డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే సబితా
X

దిశ, బడంగ్ పేట్ : సర్కిల్ నాదర్ గుల్ డివిజన్ పరిధిలోని స్వేచ్ఛ నివాస్, సౌభాగ్యపురం, కేఆర్ఆర్ హిల్స్ కాలనీలలో పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా మాట్లాడుతూ గత సంవత్సరం నుండి మూడు కాలనీలలో డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గత ప్రభుత్వంలో ప్రారంభమైన ఎస్ఎన్డీపీ (SNDP) నాలా పనులు నిలిపివేయడంతో సమస్య ఎదురైందని అన్నారు.

ఇపుడు మూడు కోట్ల రూపాయలు అనుమతులు తీసుకోవడం జరిగిందని ఎస్ఎన్ డిపి పనులు పూర్తి చేసి భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు రాకుండా పనులు చేపడతామని ఎమ్మెల్యే సబితా తెలిపారు. బాక్స్ నాలా పనులు పూర్తి అయిన తర్వాత భవిష్యత్తు లో ఇబ్బందులు లేకుండా డ్రైనేజీ ను మెరుగుపరుస్తామని అన్నారు.గతంలో బడంగ్ పేట్ కార్పొరేషన్ ఉన్నప్పుడు తీర్మానం చేసిన 800 పనులు పైగా నిలిచిపోయాయని తొందర్లోనే కాలనీ లో రోడ్లు,డ్రైనేజ్ లకు టెండర్లు పిలిచి,బడ్జెట్ కేటాయించి ప్రనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది రాకుండా బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు,నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి,అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు.

అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే సబితా

టెండర్ ప్రక్రియ పూర్తి కాకుండానే ఇష్టం వచ్చినట్టు పనులు చేపడుతున్నారని అధికారుల పై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు పూర్తయిన తర్వాతనే పనులు ప్రారంభించాలని సందర్భంగా అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో సౌభాగ్యపురి కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ రావు, వీరబాబు, భాషా, బుచ్చయ్య, సురేష్, చంద్ర శేఖర్ రెడ్డి, యాద గిరి, పార్టీ నాయకులు రామిడి రామిరెడ్డి,దోనూరు శ్రీనివాస్ రెడ్డి,సమ్ రెడ్డి వెంకట్ రెడ్డి,బోయపల్లి శేఖర్ రెడ్డి, ముత్యాల కృష్ణ, ఏనుగు రామిరెడ్డి, తుఫాన్ రెడ్డి, ముత్యం రెడ్డి,సత్తిరెడ్డి,కోటగిరి జంగయ్య, మహిళా నాయకురాళ్లు జాలే సరిత రెడ్డి,ఆకుల సరిత, గీత కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Next Story