- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, నర్సంపేట : సినీ రచయిత, కవి కందికొండ యాదగిరి అంతిమ యాత్రకి అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సహా బంధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కందికొండ భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కందికొండ ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసినప్పటి నుంచి కళాకారులు, ప్రభుత్వ పరంగా కాపాడుకునేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా తెలంగాణ బతుకమ్మ పండుగ వైభవాన్ని చాటిన వ్యక్తి కందికొండ అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు తన రచనల ద్వారా ముందుకునడిపిన మహా వ్యక్తిగా కొనియాడారు. కందికొండ కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం జరిగేలా ప్రభుత్వం అండగా ఉండే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Next Story






