- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ఫుడ్ పాయిజన్ ఘటన.. విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే
మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

దిశ, కొణిజర్ల: మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన మండల పరిధిలోని బోడియ తండ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు పప్పు, కోడిగుడ్డుతో భోజనం వడ్డించారు. భోజనం చేసిన గంట తర్వాత 14 మందికి కడుపులో నొప్పితో కూడిన వాంతులు మొదలయ్యాయి. దీంతో ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రులు కలిసి పిల్లలను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఎమ్మెల్యే పరామర్శ
చికిత్స పొందుతున్న విద్యార్థులను స్థానిక శాసనసభ్యులు మాళోతు రామదాసు నాయక్ సందర్శించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. డీఈవో జైని చికిత్స పొందుతున్న పిల్లలను సందర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యం అడిగి తెలుసుకున్నారు. సంఘటనపై విచారణ జరిపించి తగు చర్యలు చేపడతామన్నారు. తహసీల్దార్ అరుణ ఎంపీడీవో వర్ష కొనిజర్ల మాజీ సర్పంచ్ సూరంపల్లి రామారావు కాంగ్రెస్ పార్టీ నాయకులు వై.చిరంజీవి భూక్యా రామ్ లాల్ తదితరులు పరామర్శించారు.






