- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతి పండక్కి ముస్తాబవుతున్న ‘నారావారిపల్లె’
ప్రతీ ఏడాది సంక్రాంతి పండగను సొంత గ్రామమైన నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ ఏడాది సంక్రాంతి పండగ(Sankranti Festival)ను సొంత గ్రామమైన నారావారిపల్లె(Naravaaripalle)లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా కుటుంబ సమేతంగా నారావారిపల్లెలో నిర్వహించబోయే సంక్రాంతి సంబురాల్లో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొనబోతున్నారు. దీంతో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని నారావారిపల్లెలో పర్యటించారు. ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. అభివృద్ధి పనులపై ఆరా తీశారు. సంక్రాంతికి ప్రారంభించనున్న స్కిల్ డెవలప్మెంట్ భవనం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, టాటా ఈ సంజీవిని ప్రాజెక్టు, శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లే సీసీ రోడ్డు పనులు, మాలపల్లి గ్రామంలో జరుగుతున్న పనులను, చెరువును పరిశీలించారు. విద్యుత్, పోలీస్, రెవెన్యూ ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలసి ముఖ్యమంత్రి పర్యటనను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






