ప్రజలంతా కాంగ్రెస్ తోనే ఉన్నారు : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

by Muthe.Rajitha |

ప్రజలంతా కాంగ్రెస్ తోనే ఉన్నారని మున్సిపల్ ఫలితాల్లో తేలిందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

ప్రజలంతా కాంగ్రెస్ తోనే ఉన్నారు : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపాలిటీల్లో దాదాపు 90 శాతం గెలుచుకున్నామని, కార్పొరేషన్ లలో కరీంనగర్ మినహా అన్ని చోట్ల గెలిచామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. నగర, పట్టణ ప్రజలు కాంగ్రెస్ తో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ పైన అపోహలను తొలగిపోయాయన్నారు. మంగళవారం సీఎల్పీ మీడియా సెంటర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, హరీష్ రావు పనిగట్టుకుని ఇంత కాలం చేసిన ప్రచారాన్ని ప్రజలు మరో సారి తిప్పికొట్టారని, ఇక ముందు కేటీఆర్, హరీష్ రావులు ఏ మొహం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతారని మేడిపల్లి స్యతం ప్రశ్నించారు. ప్రజలు చిత్కరించినా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారని, కేటీఆర్ ఇక ముందు నోరు మూసుకోవాలని ఆయన హితవు పలికారు. కేటీఆర్, హరీష్ రావుల మాటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం లేదని, దౌర్జన్యం చేశారంటూ కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు..మాకు ఆ అవసరం లేదు..ప్రజలు మా వెంట ఉన్నారని మేడిపల్లి సత్యం తెలిపారు.

తొర్రూరు, జనగాం లో టాస్ లో కూడా అదృష్టం కాంగ్రెస్ నే వరించిందని, దేవుడు కూడా మా వెంటే ఉన్నాడన్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి పాలనకు ప్రజలు పట్టం కట్టారని, సింహం సింగిల్ గా వచ్చినట్లు మా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పార్టీ ని గెలిపించారన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలను ఆయన తెలిపారు. ఈ పుట్టిన రోజు నుంచైనా కేసీఆర్ తన విధానాలను మార్చుకుంటారని ఆశిస్తున్నానని, తన కొడుకు, అల్లుడుని చక్కదిద్దుకోవాలని మేడిపల్లి సత్యం అన్నారు.

Next Story