- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభివృద్ధి పనులపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ
అభివృద్ధి పనులు, తాగునీటి సమస్యల పరిష్కారం, జలమండలిలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.

దిశ, అల్వాల్ : మల్కాజిగిరి నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, తాగునీటి సమస్యల పరిష్కారం, జలమండలిలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి (ఐఏఎస్)ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జలమండలిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 'సమాన పనికి సమాన వేతనం' సూత్రాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఒకే విధమైన పనులు, ఒకే బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ వేర్వేరు కేటగిరీల పేర్లతో అసమాన వేతనాలు చెల్లించడం సరికాదని పేర్కొన్నారు. స్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఉద్యోగులకు న్యాయమైన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విధి నిర్వహణలో మరణించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా మానవతా దృక్పథంతో వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు కల్పించాలని కోరారు. అలాగే కౌకూర్ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో నెలకొన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వాటర్ ట్రయల్ రన్ నిర్వహించి ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. మచ్చబొల్లారం పరిధిలోని ఏడు కాలనీలకు భూగర్భ డ్రైనేజీ ట్రంక్ మెయిన్ నిర్మాణానికి రూ.4 కోట్ల నిధులు మంజూరు చేసి, టెండర్ ప్రక్రియ పూర్తి చేసి త్వరలో పనులు ప్రారంభించేందుకు సహకరించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జేఏసీ వెంకన్న, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.






