- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నో ఏళ్ల కల... ఫలించనున్న వేళ
మండల కేంద్రంలోని పోచమ్మ రేవు వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి.

దిశ, గాంధారి : మండల కేంద్రంలోని పోచమ్మ రేవు వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఎన్నో ఏళ్లుగా వంతెన కోసం ఎదురుచూసిన రైతన్నల కల సాకారమవుతుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పోచమ్మ రేవు పై బ్రిడ్జి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఆ హామీని నిలబెట్టుకున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో ఆ శివారు ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి రూ.4.90 కోట్ల నిధులు మంజూరు చేయడంతో వెంటనే టెండర్లు పిలిచి పనులు శరవేగంగా చేపట్టారు. దీంతో ఎన్నో ఏళ్లుగా వెంటాడుతున్న తమ జీవితకాల సమస్యకు పరిష్కారం లభించిందని రైతులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
గతంలో వర్షాకాలం వచ్చిందంటే పోచమ్మ రేవు శివారు ప్రాంత రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. భారీ వర్షాలతో వాగు ఉప్పొంగి ప్రవహించిన సమయంలో ఎరువులు, విత్తనాలు తీసుకుని పొలాలకు వెళ్లలేక నానా అవస్థలు పడేవారు. కొన్నిసార్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగును దాటే ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో గుర్జాల్ శివారు మీదుగా దాదాపు ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. అంతేకాకుండా, గ్రామంలో ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలు నిర్వహించడంలో కూడా కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణం తుది దశకు చేరుకోవడంతో రైతులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారధి అందుబాటులోకి వస్తే వ్యవసాయ కార్యకలాపాలు సులభతరం కావడంతో పాటు ప్రజల రాకపోకలకు కూడా ఎంతో సౌకర్యంగా మారనుంది.






