- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది
ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా సదాశివనగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రారంభించారు.

దిశ, సదాశివనగర్ : ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా సదాశివనగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రారంభించారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ .. గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. నూతన గ్రామపంచాయతీ భవనం ద్వారా ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభంగా, వేగంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి పనుల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో ఈ భవనం కీలకపాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాత లింగంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎమ్మెల్యే చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






