- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో పని చేస్తున్నానని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో పని చేస్తున్నానని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టణంలోని గోధుమవాగు బ్రిడ్జి సమీపంలో సుమారు రూ.200 కోట్ల నిధులతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. నత్తనడకన సాగుతున్న నిర్మాణ పనులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ప్రారంభించి 6 నెలలు దాటిన ఇప్పటివరకు రెండు శాతం పనులు మాత్రమే పూర్తవడం, పనులు ఆలస్యం కావడానికి గల కారణాలను తెలుసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి తరగతులను ప్రారంభించాలంటే పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్తగూడెం నియోజకవర్గంలోని పేద కుటుంబాల పిల్లలకు యంగ్ ఇండియా స్కూల్ వరం లాంటిదని కార్పొరేట్ స్థాయిలో ఇక్కడ విద్యను అందిస్తారని భవిష్యత్తులో ఇక్కడ అడ్మిషన్ల కోసం పోటీ ఉండొచ్చని తెలిపారు. ఇప్పటికే మన్మోహన్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాల, కేంద్రీయ విద్యాలయం, తెలంగాణా పబ్లిక్ స్కూల్, మైనారిటీ కాలేజ్, మరో జూనియర్ కాలేజ్‌లు మంజూరు అయ్యాయని మంజూరు వివరించారు. సుజాత నగర్ మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు, ఐటీ ఐ , పాలిటెక్నిక్ కళాశాల కు పాల్వంచ డిగ్రీ కళాశాల కు నిధులు మంజూరు చేయించానని చెప్పారు.
స్టేడియం నిర్మాణం కోసం హౌసింగ్ బోర్డ్ ఏరియాలో సుమారు 16 ఎకరాల స్థలం గుర్తించమని , పాల్వంచ క్రీడా పాఠశాల అభివృద్ధికి మరిన్ని నిధుల కోసం ప్రతిపాదనలు పంపమన్నారు. ఇక ఎయిర్ పోర్టు ఏర్పాటు కు అనువైన భూమి కోసం విమానయాన శాఖ అధికారులకే బాధ్యతలు అప్పగించామని ఆ శాఖాధికారులు అనువైన స్థలం ఎంపిక చేసి తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బై పాస్ రోడ్ నిర్మాణం కోసం ' సేతు బంధు ' పథకం ద్వారా నిధులు మంజూరు అవుతున్నాయని దాదాపు రూ.160కోట్లతో ఒకటిన్నర కిలోమీటరు మేర ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
పట్టణంలో రింగ్ రోడ్ లు , రేగల్ల , సీతం పేట, చిట్టి రామవరం, పెనుబల్లి, గరిమెళ్ళపాడు, హేమచంద్ర పురం, అనిశెట్టి పల్లి, సోములగూడెం, తదితర ప్రాంతాల్లో బ్రిడ్జి ల నిర్మాణ పనులు జరుగుతున్నాయనీ వివరించారు. సింగభపాలెం చెరువు మరమ్మత్తుల కోసం రూ.5.50 కోట్లు కేటాయించామని పనులు జరుగుతున్నాయని ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నానని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ మేయర్ గణేష్, కమిషనర్ సుజాత, డి ఈ వో వాసంతి, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






