పెస్టిసైడ్స్ దుకాణం ముందు మృతదేహంతో ఆందోళన

by Batti.Sumithra |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కరీంనగర్ జాతీయ రహదారి వెంబడి కోటార్‌మూర్ ఏరియాలో గల అన్నపూర్ణ సీడ్స్ & పెస్టిసైడ్స్ దుకాణం ముందు లక్కోర గ్రామానికి చెందిన వినయ్ కుటుంబ సభ్యులు, మృతి చెందిన వినయ్ మృతదేహంతో సోమవారం ఆందోళన చేశారు.

పెస్టిసైడ్స్ దుకాణం ముందు మృతదేహంతో ఆందోళన
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కరీంనగర్ జాతీయ రహదారి వెంబడి కోటార్‌మూర్ ఏరియాలో గల అన్నపూర్ణ సీడ్స్ & పెస్టిసైడ్స్ దుకాణం ముందు లక్కోర గ్రామానికి చెందిన వినయ్ కుటుంబ సభ్యులు, మృతి చెందిన వినయ్ మృతదేహంతో సోమవారం ఆందోళన చేశారు. ఆందోళన చేసిన వినయ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్కోర గ్రామానికి చెందిన బేస్త కులానికి చెందిన డి. వినయ్ ఈ నెల 12వ తేదీన అన్నపూర్ణ సీడ్స్ & పెస్టిసైడ్స్ దుకాణంలో గడ్డి మందు తీసుకొని దానిని సేవించినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి వినయ్ మృతి చెందినట్లు మృతుడి కుటుంబీకులు వాపోయారు.

సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణ నిర్వాహకుడిని మృతుడి కుటుంబ సభ్యులు సోమవారం వచ్చి నిలదీశారు. ప్రభుత్వం బ్యాన్ చేసిన గడ్డి మందును ఎలాంటి రుజువు, ఆధార పత్రాలు లేకుండా ఎలా అమ్ముతారని పెస్టిసైడ్స్ దుకాణ నిర్వాహకుడిని మృతి చెందిన వినయ్ కుటుంబ సభ్యులు నిలదీసి వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటన వివరాలు తెలుసుకున్న ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ గౌడ్ పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న మృతుడి కుటుంబ సభ్యులను అక్కడి నుంచి వెళ్లాలని కోరారు. మీరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగిందని, ఫిర్యాదు ప్రకారమే అన్ని చర్యలు తీసుకుంటామని, మీరు ఇలా ఆందోళన చేయడం మంచి పద్ధతి కాదని ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ గౌడ్ ఆందోళనకారులను సముదాయించి అక్కడి నుంచి పంపించారు.

Next Story