- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గడప గడపకూ సంక్షేమం: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, వారి సేవలోనే నిరంతరం శ్రమిస్తామని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, హుజురాబాద్ రూరల్: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, వారి సేవలోనే నిరంతరం శ్రమిస్తామని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. హుజురాబాద్ మండల పరిధిలోని సిర్సపల్లి, రాజపల్లి, చెల్పూర్, బొత్తలపల్లి, పెద్దపాపయ్యపల్లి, కాట్రపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే స్వయంగా పర్యటించారు. లబ్ధిదారుల ఇండ్ల వద్దకే వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ నిధి కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్తూ, క్లిష్ట సమయాల్లో ప్రజలకు అండగా నిలవడమే ప్రజాప్రతినిధిగా తన ప్రథమ కర్తవ్యమని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రజల విశ్వాసమే నా బలం.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... "ప్రజల కష్టసుఖాల్లో నేను ఎల్లప్పుడూ భాగస్వామినై ఉంటాను. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తాను. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు నాపై ఉంచిన విశ్వాసమే నాకు కొండంత బలం. వారి సేవ చేయడమే నా బాధ్యత, సంక్షేమమే నా ఏకైక లక్ష్యం." అని నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా తాము ముందుకు సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎస్.డి. జావెద్, పీఏసీఎస్ చైర్మన్ కొండాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, కేడీసీసీబీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగళి రమేష్, మాజీ ఎంపీపీ వెంకటేష్‌లతో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






