- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొరాయిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు... పట్టించుకోని సంబంధిత అధికారులు
by Batti.Sumithra |
సదాశివనగర్ మండల కేంద్రంలోని మల్లుపేట గ్రామ శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారి పై సోమవారం మధ్యాహ్నం ఓ ఎలక్ట్రిక్ బస్సు మొరాయించింది.

X
దిశ, సదాశివనగర్ : సదాశివనగర్ మండల కేంద్రంలోని మల్లుపేట గ్రామ శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారి పై సోమవారం మధ్యాహ్నం ఓ ఎలక్ట్రిక్ బస్సు మొరాయించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎలక్ట్రిక్ బస్సు మొరాయించడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు డ్రైవర్ పై మండిపడ్డారు. ప్రయాణికులు మాట్లాడుతూ బస్సులను డిపోలోనే సక్రమంగా తనిఖీ చేసి రోడ్డుపైకి పంపాలని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. బస్సు మొరాయించడంతో ప్రయాణికులను బస్సు నుంచి దింపి, మరో బస్సులో ఎక్కించి వారి గమ్యస్థానాలకు పంపించారు.
Next Story






