‘ఈ నగరానికి ఏమైంది’ గ్యాంగ్ ఈజ్ బ్యాక్.. సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్

by Chukka Sudharani |

యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కల్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’.

‘ఈ నగరానికి ఏమైంది’ గ్యాంగ్ ఈజ్ బ్యాక్.. సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కల్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. 2018లో విడుదలైన ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే.. మొదట థియేటర్‌లో విడుదలై సాధారణ విజయాన్ని అందుకున్నప్పటికీ, ఓటీటీలో మాత్రం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా యువతలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పచుకున్న ఈ కల్ట్ క్లాసిక్‌కు ఇప్పుడు సీక్వెల్‌గా ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ రాబోతుంది. తాజాగా ఈ సీక్వెల్‌ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ.. ఈ సినిమాను నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ వీడియోలో.. నలుగురు హీరోలు విశ్వక్ సేన్, సాయినాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను ఓ కార్‌లో ‘ముస్తఫా.. ముస్తఫా’ సాంగ్ వింటూ వెళ్తున్నట్లు కనిపించగా.. ‘గ్యాంగ్ ఈజ్ బ్యాక్’ అనే మీనింగ్ వచ్చేలా కట్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. కాగా.. మొదటి భాగంలో నటించిన విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయ్యగా.. ఇప్పుడు వచ్చే సీక్వెల్‌పై కూడా పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

Next Story