- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్య పరీక్షల కోసం ముంబయి వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం ముంబయి చేరుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం ముంబయి చేరుకున్నారు. గత కొంతకాలంగా ఆయన భుజాలకు సంబంధించిన తీవ్రమైన ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పవన్‌కల్యాణ్ గత కొంతకాలంగా భుజాలకి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్నారు. రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో ఆయన తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స..
ఈ భుజాల సమస్యకు మెరుగైన వైద్య పరీక్షలు చేయించుకోవడం కోసం ఆయన ముంబయిలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. అక్కడ నిపుణులైన వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి, తదుపరి చికిత్సను అందించనున్నారు. పవన్‌కల్యాణ్ వెంట ఆయన సతీమణి అన్నా కొణిదెల కూడా ముంబయి వెళ్లారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను, ఫోటోలను జనసేన పార్టీ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పత్రికా ప్రకటన ద్వారా పంచుకుంది.






