రాజగోపాల్ రెడ్డి దానకర్ణుడు.. ఆయన ఉండగా నేనేం చేయగలను: మంత్రి కోమటిరెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2026-06-29 09:54:20  IST  )

తన వద్దకు సహాయం కోసం వచ్చిన మహిళతో తన తమ్ముడి దాతృత్వం గురించి చెబుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

రాజగోపాల్ రెడ్డి దానకర్ణుడు.. ఆయన ఉండగా నేనేం చేయగలను: మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లోనే కాదు దాతృత్వంలోనూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంటారు. తాజాగా తన వద్దకు సహాయం కోసం ఓ మహిళ రాగా ఆమెత తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్‍గా మారాయి. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఒక మహిళ తన ఇబ్బందులను వివరిస్తూ సహాయం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని వేడుకుంది. మహిళ మాటలకు స్పందించిన మంత్రి.. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి లాంటి పెద్ద దానకర్ణడు ఉన్నాడు. నేను రూ. 50 వేలు లక్ష ఇస్తే అక్కడ ఆయన అన్నీ చూసుకుంటాడు. నాదగ్గర డబ్బులు లేవు. నేనే గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉంటున్నా. రాజగోపాల్ రెడ్డి వద్దకే వెళ్లండి ఆయనైతే అన్ని చూసుకుంటారు అని చమత్కరించారు. అనంతరం ఉపాధి నిమిత్తం ప్రభుత్వం తరఫున రూ. 50 వేల ఆర్థిక సాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Next Story