- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, కుత్బుల్లాపూర్: ప్రణాళికతో అభివృద్ధి పనులు చేయాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. పేట్ బషీరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన, చేయాల్సిన అభివృద్ధి పనులపై ఆయన జోనల్ కమిషనర్ వి. మమత తో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సీసీ రోడ్లు వేయడం, జంక్షన్ లు, ఫుట్ పాత్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, పార్కుల అభివృద్ధి పై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవలే మంజూరైన రూ.20 కోట్లతో పనులను ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్, ఐడిపిఎల్, సూరారం చౌరస్తాలో నిత్యం ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. చేసిన పనులు దశాబ్దాల పాటు నాణ్యతగా ఉండే విధంగా చూడాలన్నారు. ఎలాంటి సమస్యలైనా ప్రత్యేక ప్రణాళికతో పరిష్కరించేలా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ చెన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






