- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి అధికారుల దీక్షలకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
సింగరేణి ఇల్లందు ఏరియాలో అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి.

దిశ, ఇల్లందు : సింగరేణి ఇల్లందు ఏరియాలో అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఆరో రోజు దీక్షలో ఆర్.వెంకటేశ్వర్లు (డిప్యూటీ మేనేజర్), ఎంపీటీసీ నరసింహారావు (డీ.వై.ఎస్.ఈ.), సి. బండి రాము, జేఓఈ అండ్ ఎం. పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అధికారులకు సంఘీభావం ప్రకటించారు. అధికారులు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నారని, వారి సమస్యలు త్వరగా పరిష్కారం కావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పీఆర్‌పీ, పే స్కేల్ తదితర సమస్యలపై ప్రభుత్వం, సంబంధిత యాజమాన్యం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని కోరారు. సింగరేణి చరిత్రలో అధికారులు నిరాహార దీక్షలు చేపట్టడం ఇదే తొలిసారని పేర్కొన్న ఎమ్మెల్యే, ఈ పరిస్థితి రావడం బాధాకరమని అన్నారు. అధికారుల డిమాండ్లను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కోరం కనకయ్య దీక్షలో పాల్గొన్న అధికారులకు నిమ్మరసం తాగించి ఆరో రోజు రిలే నిరాహార దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఏరియా జనరల్ మేనేజర్ వీసం కృష్ణయ్య కూడా పాల్గొని అధికారులకు నిమ్మరసం అందించి దీక్ష విరమింపజేశారు.






