అదే నా ప్రాబ్లం.. కంటతడి పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల

by Satheesh |

దిశ, తిరుమలాయపాలెం: టీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో- latest Telugu news

అదే నా ప్రాబ్లం.. కంటతడి పెట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల
X

దిశ, తిరుమలాయపాలెం: టీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలోపాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కంటతడిపెట్టారు. శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బి.వీరన్న అధ్యక్షతన దమ్మాయిగూడెం గ్రామంలో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి హాజరైయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నా వ్యక్తిత్వంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆపదలో ఉన్నవారిని చూసి జాలి పడతానని.. అందరికీ మంచి చేయాలని అనుకుంటానని అన్నారు.

అంతే తప్ప ఎదుటివారిని నొప్పించే మనస్తత్వం నాది కాదని.. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నాదే అనుకుంటా అని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి కుల, మత, ప్రాంత భేదాలు లేవని తెలిపారు. రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేస్తానని చెప్పారు. కార్యకర్తలు ఏ సమయంలో వచ్చిన కలుస్తానని అన్నారు. నా మనస్తత్వం ఏంటో మీకు తెలుసని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న నేపథ్యంలో కందాల భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు సహకరించాలని కోరారు.

Next Story