గ్రామాభివృద్ధికి సహకరిస్తా: ఎమ్మెల్యే గంప గోవర్ధన్

by Vinod kumar |

దిశ, భిక్కనూరు: గ్రామాభివృద్ధికి అన్ని రకాల - MLA Gampa Govardhan said that he will contribute to rural development

గ్రామాభివృద్ధికి సహకరిస్తా: ఎమ్మెల్యే గంప గోవర్ధన్
X

దిశ, భిక్కనూరు: గ్రామాభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. గురువారం భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన డీసీసీబీ డైరెక్టర్ గోండ్ల సిద్ధరాములు, సర్పంచ్ నర్సింలు యాదవ్, టీఆర్ఎస్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి అత్తెల్లి శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులు మంజూరు చేయాలని కోరగా.. సానుకూలంగా స్పందించారని తెలిపారు. తొందర్లోనే గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం నుండి బీటీ రోడ్డు పనులు ప్రారంభమవుతాయని, సీసీ రోడ్డు నిర్మాణ పనులు కూడా చేపట్టడం జరుగుతుందని వివరించారు.

Next Story