'దిశ' కథనానికి స్పందన.. పేదింటి బిడ్డకు అండగా ఎమ్మెల్యే గాదరి..

by Disha Web Desk 19 |
దిశ కథనానికి స్పందన.. పేదింటి బిడ్డకు అండగా ఎమ్మెల్యే గాదరి..
X

దిశ, తుంగతుర్తి: 'మెడికల్ లో మెరిసినా.. ఎదగనివ్వని పేదరికం' అంటూ 'దిశ' పత్రికలో ప్రచురితమైన కథనానికి ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు. దీనిలో భాగంగా ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన పేదింటి గిరిజన బిడ్డకు తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అండగా నిలిచారు. తుంగతుర్తి మండలం ఏనేకుంటతండకు చెందిన భానోత్ ప్రేమ్ కుమార్ ఎంబీబీఎస్‌లో సీటు సాధించాడు. అయితే, అతడికి ఆర్థిక సమస్యలు ఉండటంతో.. అది తెలుసుకున్న ఎమ్మెల్యే కిషోర్ రూ.20వేలు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ నగదును ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, డీసీసీబి డైరెక్టర్ సైదులు, ప్రేమ్ కుమార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీశైలం, గుండగాని రాములు, గ్రంధాలయ, దేవాలయ కమిటీ చైర్మెన్‌లు గోపగాని రమేష్, ముత్యాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed