- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, బెల్లంపల్లి: సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా బుధవారం సింగరేణి ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని లక్ష మందికి రక్తదానం సేకరణ లక్ష్యంగా పనిచేయాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు.. గులాబీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు సేవా కార్యక్రమాల్లో మునిగిపోయారని పేర్కొన్నారు. రక్తదాన క్యాంపులో సేకరించిన రక్త నిల్వలు లక్ష మందికి ప్రాణదానం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story






