Mission Bhagiratha Employees: జీతాలు ఇప్పించండి మహాప్రభో... 2018 నుంచి ఇవ్వట్లేదు

by Dishanational1 |
Mission Bhagiratha Employees meets MLA Sandra Venkata veeraiah
X

దిశ, కల్లూరు: Mission Bhagiratha Employees meets MLA Sandra Venkata veeraiah| ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథలో ఎల్ఎన్టీ కంపెనీ అనుసంధానంగా 470 మంది కార్మికులు పనిచేస్తున్నారు. జీతాలు మరియు ఇతర సమస్యలపై పలుమార్లు ఉన్నత అధికారులకు వినతి పత్రం అందించినా కూడా ఎటువంటి స్పందన లేదని ఉద్యోగులు వాపోతున్నారు. కల్లూరు రెవెన్యూ డివిజన్ లో 110 మంది మిషన్ భగీరథ ఉద్యోగులు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. ప్రస్తుత తరుణంలో అన్ని ధరలు పెరిగి జీతాలు సకాలంలో రాక కుటుంబజీవనం భారంగా ఉందని, వెంటనే తమ జీతాలు, 2018 నుండి ఆగిపోయిన బోనస్ సకాలంలో ఇప్పించాలని విన్నవించుకున్నారు. వినతిపత్రం అందించినవారిలో జిల్లా ఉపాధ్యక్షుడు మేకల రవి, మిషన్ భగీరథ ఉద్యోగులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: విగ్రహం చుట్టూ రాజకీయం.. ఇరకాటంలో కేటీఆర్

Next Story

Most Viewed