- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, కంది: తన కొడుకుని తీసుకుని ఓ తల్లి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ రమేష్ తెలిపిన వివరాలు ప్రకారం.. సంగారెడ్డి పట్టణంలోని రామ్ నగర్ కాలనీ లో నివాసం ఉంటున్న మింగిపల్లి మంజుల (40), ఆమె కొడుకు డొలకనాథ్ (10) ఈ నెల 12న ఉదయం 7 గంటల సమయంలో ఇద్దరి బట్టలు సదురుకుని ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది.
అయితే మంజుల భర్త పోచయ్య కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఈమే స్థానికంగా సంగారెడ్డి మండలం కల్పగూర్ నుంచి చేపలను తెచ్చి సోమవారం అంగడిలోనీ చేపల మార్కెట్లో చేపలు విక్రయిస్తూ జీవిస్తుండేది. దీంతో ఆమె బంధువు పవన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంధువుల నుంచి కొన్ని ఇబ్బందుల కారణంగానే ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరి ఆచూకీ తెలిసినవారు 9490617010 లేదా 08455-276333 నెంబర్లకు సమాచారాన్ని అందించాలని సూచించారు.






