- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్తల్‌లో మంత్రుల పర్యటన.. 22 కి.మీ భారీ బైక్ ర్యాలీ!
by Jakkula.Mamatha |
రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో ఊట్కూర్ మండల పరిధిలోని తిప్రాస్‌పల్లి వద్ద మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో 22 కిలోమీటర్ల భారీ బైక్ ర్యాలీ ప్రారంభమైంది.

X
దిశ, మక్తల్/ఊట్కూర్: రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో ఊట్కూర్ మండల పరిధిలోని తిప్రాస్‌పల్లి వద్ద మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో 22 కిలోమీటర్ల భారీ బైక్ ర్యాలీ ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, యువకులు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఊట్కూర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి శ్రీహరి, అనంతరం మక్తల్‌కు బయలుదేరారు. మక్తల్‌లో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించనున్నారు. ర్యాలీ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి భద్రతా చర్యలు చేపట్టారు.
Next Story






