- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సారంగ దరియా పాటకు బాలయ్య చిన్న కూతురు గ్రేస్ ఫుల్ స్టెప్పులు.. సాయి పల్లవిని హెచ్చరిస్తూ నెటిజన్ల కామెంట్స్
కొందరైతే ఏకంగా డాన్స్ క్వీన్ సాయి పల్లవికి గట్టి కాంపిటీషన్ ఇచ్చేలా తేజస్విని ఉందంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని పేరు నెట్టింట మార్మోగిపోతోంది. వెండితెరపై కనిపించనప్పటికీ తన టాలెంట్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను రాబట్టుకున్నారు. ఇటీవల ఓ డాన్స్ వీడియోతో నెట్టింట ఆమె సృష్టించిన సెన్సేషన్ ఇంకా మరువముందే.. మరో డాన్స్ వీడియోతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. సాయిపల్లవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సాంగ్ అయిన సారంగ దరియా పాటకు తేజస్విని వేసిన గ్రేస్‌ఫుల్ స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పక్కా ప్రొఫెషనల్ డాన్సర్‌లాగా ఆమె ఇచ్చిన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ చూసి నందమూరి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కొందరైతే ఏకంగా డాన్స్ క్వీన్ సాయి పల్లవికి గట్టి కాంపిటీషన్ ఇచ్చేలా తేజస్విని ఉందంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. తేజస్విని కేవలం ఇలాంటి డాన్స్ వీడియోలతోనే కాకుండా, నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన కీలక బాధ్యతలను కూడా తన భుజాలపై వేసుకున్నారు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'NBK-111' సినిమాకు ఆమె ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలయ్య సినిమా పనులను చూసుకోవడమే కాకుండా, నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తన తమ్ముడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పనులను కూడా ఆమె దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నట్లు టాక్ . మొత్తానికి అటు ప్రొడక్షన్ పనులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఇటు తనలోని డాన్స్ టాలెంట్‌తో సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూ తన క్రేజ్ మరింత పెంచుకుంటున్నారు తేజస్విని.






