'కొరియన్ కనకరాజు' నుంచి క్రేజీ అప్డేట్.. టీజర్‌ను లాంచ్ చేయనున్న ప్రభాస్

by Pulgam srinivas |

'కొరియన్ కనకరాజు' టీజర్‌ను నేడు సాయంత్రం 4:05 గంటలకు రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయనున్నారు.

కొరియన్ కనకరాజు నుంచి క్రేజీ అప్డేట్.. టీజర్‌ను లాంచ్ చేయనున్న ప్రభాస్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కొరియన్ కనకరాజు' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రితిక నాయక్ కథానాయికగా కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ను నేడు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా టీజర్ విడుదలకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్‌ను చిత్ర బృందం వెల్లడించింది. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా నేడు సాయంత్రం 4:05 గంటలకు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రభాస్ చేతుల మీదుగా విడుదల కానున్న టీజర్‌తో సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.




Next Story