- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్ ఆధ్వర్యంలో సమావేశం.. బీజేపీ తరపున కీలక ఎంపీ హాజరు!
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులే లక్ష్యంగా ఈరోజు ముఖ్యమైన సర్వసభ్య సమావేశం జరగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులే లక్ష్యంగా ఈరోజు ముఖ్యమైన సర్వసభ్య సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా భవన్‌లో ఈ 'ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్' ఏర్పాటు కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక భేటీకి రాష్ట్రంలోని వివిధ పార్టీల పార్లమెంట్ సభ్యులు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సాగనున్న ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరపున చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి హాజరుకానున్నారు. ఈ మీటింగ్‌లో బీజేపీ తరపున తమ పార్టీ బలమైన వాదనను వినిపించేందుకు, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశాలను లేవనెత్తేందుకు ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి సిద్ధమయ్యారు.
ప్రధాన చర్చనీయాంశాలు ఇవే..
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వివిధ పద్దుల పెండింగ్ నిధులను ఎలా రాబట్టాలనే దానిపై రోడ్ మ్యాప్. రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి, రవాణా, మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు, నిధుల సాధనపై వ్యూహరచన. కేంద్రం వద్ద రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు రాజకీయాలకు అతీతంగా ఎంపీలందరూ కలిసికట్టుగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు ఒకే వేదికపైకి వస్తుండటంతో ఈ సమావేశం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది.






