- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రిడ్జ్ పేలి ఇల్లు దగ్ధం.. రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం
ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలిపోవడంతో మొత్తం ఇల్లంతా కాలి బూడిద పాలయ్యింది.

దిశ, సంగారెడ్డి: ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలిపోవడంతో మొత్తం ఇల్లంతా కాలి బూడిద పాలయ్యింది. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణంలో తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోతిరెడ్డిపల్లి రోడ్ నెంబర్ 3 గాయత్రి శ్రీనివాసం అపార్ట్మెంట్లోని మొదటి అంతస్తులో సాయి సంతోష్ యాదవ్‌కు చెందిన ఫ్లాట్ ఉంది. అయితే ఉదయం 6 గంటల సమయంలో ఫ్రిడ్జ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పుడు ఇంట్లో ఉన్న లీల ఉంది. భయంతో ఆమె పక్కింటి వారికి సమాచారం చేరవేసింది. అపార్ట్మెంట్ అంతా ఫర్నిచర్ చేసి ఉండటం కారణంగా మంటల వ్యాప్తి వేగంగా పెరిగింది. చూస్తూ చూస్తూనే మంటలంతా వ్యాప్తి చెంది ఇల్లు మొత్తం ఖాళీ బూడిద అయింది. ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని బాధితులు వాపోయారు. దాదాపు రూ. 50 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని, ఇంట్లో ఏ ఒక్క వస్తువు కూడా మిగలకుండా సర్వం మంటల్లో కాలిపోయాయని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.






