అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు.. 79 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్!

by Malleboina Mahesh |

ఇరాన్-అమెరికా దాడుల ప్రభావంతో హార్ముజ్ జలసంధిలో నిలిచిన నౌకల రవాణా.. $79 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడాయిల్ ధర!

అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు.. 79 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్!
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ - అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు మళ్లీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. పశ్చిమాసియా (Middle East) లో యుద్ధ వాతావరణానికి దారి తీయడమే దీనికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. గత రాత్రి ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సెంట్‌కామ్ (CENTCOM) దళాలు భారీ ఎయిర్ స్ట్రైక్స్ (వైమానిక దాడులు) నిర్వహించడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడాయిల్ (Brent Crude) ధర ఇవాళ ఒక్కరోజే దాదాపు 3.5% నుంచి 4.30% మేర పెరిగి 79 డాలర్ల మార్కుకు ఎగబాకింది.

హార్ముజ్ జలసంధిలో నిలిచిపోయిన నౌకల రవాణా

ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పరిధిలో ఇరాన్ దాడులకు దిగడం, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడంతో ఆ మార్గంలో నౌకల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గతంలో రోజుకు 130 కి పైగా నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం నౌకల సంఖ్య భారీగా పడిపోయింది. అమెరికా ఇరాన్‌పై ఆంక్షలను పునరుద్ధరించడం, చమురు ఎగుమతి అనుమతులను రద్దు చేయడం, మార్కెట్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టింది. రానున్న రోజుల్లో ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే క్రూడాయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల మన దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించడం లేదు.

Next Story