- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NBK111 షూటింగ్ అప్డేట్.. బాలయ్య.. సంజయ్ దత్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ
'ఎన్‌బీకే 111' షూటింగ్‌ను ప్రస్తుతం బాలకృష్ణ, సంజయ్ దత్‌లపై చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం 'ఎన్‌బీకే 111' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకేక్కుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో చిత్రీకరణ జోరుగా సాగుతున్నట్లు సమాచారం.
ఈ షెడ్యూల్‌లో బాలకృష్ణ, సంజయ్ దత్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ అనుకున్న సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోతే డిసెంబర్‌లో సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.






