హాట్ అందాలతో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న శోభితా రాణా

by Pulgam srinivas |   (  Updated:2026-07-13 06:02:57  IST  )

వైట్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్.. శోభిత రాణా ఫోటోలు వైరల్

హాట్ అందాలతో కుర్రాళ్లను ఫిదా చేస్తున్న శోభితా రాణా
X

దిశ వెబ్ డెస్క్: అందాల నటి శోభిత రాణా 1992 జూన్ 16న జన్మించింది. మోడలింగ్ రంగంలో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె, 2014లో దర్శకుడు కబీర్ సదానంద్ తెరకెక్కించిన 'గోలు అండ్ పప్పు' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

అనంతరం 2016లో విడుదలైన పంజాబీ చిత్రం 'కెనడా డి ఫ్లైట్'లో రూప్ పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. తెలుగులో 'రాజా మీరు కేక' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన శోభిత రాణాకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.

సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే అభిమానులతో ఎక్కువగా టచ్‌లో ఉండే శోభిత రాణా, ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విశేషాలతో పాటు స్టైలిష్ ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటుంది. ఆమె పోస్ట్ చేసే చిత్రాలు తరచూ వైరల్ అవుతుంటాయి.

తాజాగా శోభిత రాణా వైట్ కలర్ స్టైలిష్ డ్రెస్‌లో కొత్త ఫోటోషూట్ చేసింది. మెడలో సింపుల్ చైన్, విరబోసిన కురులతో ఆమె స్టైలిష్ లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు ప్రశంసలు కురిపిస్తుండగా, ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story