- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యాపేటలో ఆరు హత్యల నిందితుడు రాజ్ కుమార్..?
by Malleboina Mahesh |
షాబాద్ హత్యల నిందితుడు రాజ్ కుమార్ సూర్యాపేటలో ఉన్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక పోలీసు బృందాలు అక్కడికి వెళ్లాయి.

X
దిశ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని అత్యంత క్రూరంగా చంపడం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. శుక్రవారం రాత్రి ఈ హత్యలు చోటు చేసుకొగా నింధితుడు రాజ్ కుమార్ (Accused Raj Kumar) తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే నింధితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 2 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నిందితుడు రాజ్ కుమార్ సూర్యపేటలో ఉన్నట్లు ఆచూకీ లభ్యం అయింది. దీంతో స్థానిక ఎస్పీతో డీసీపీ ఫోన్ లో మాట్లాడారు. అలాగే రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు (Special police teams) సూర్యాపేటకు బయలుదేరినట్లు తెలుస్తుంది. కాగా ఈ వ్యవహారం పై పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.
Next Story






