- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్మికుల సంక్షేమానికి మొదటి ప్రాద్యానత ఇస్తాం : మంత్రి వివేక్
కార్మికుల సంక్షేమానికి మొదటి ప్రాద్యానత ఇస్తామని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త యుగ సాంకేతిక పరిజ్ఞానాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాలు అందించి ఉపాధి శిక్షణకు ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ల (ఏటీసీ) ద్వారా యువతకు ఆధునిక పరిశ్రమలకు అవసరమైన కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో బడ్జెట్‌పై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. సంబంధిత శాఖల పనితీరును మరింత బలోపేతం చేయడానికి అవసరమైన నిధులను కేటాయించాలని కోరారు. కార్మిక శాఖ కార్మికుల సంక్షేమం కోసం సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. విదేశీ ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు ఏటీసీలో భాషా శిక్షణ కోర్సులను ప్రారంభిస్తున్నామని భవిష్యత్తులో విదేశీ నియామకాల విషయంలో ఇవి గేమ్ చేంజర్‌గా మారనున్నాయని అభిప్రాయపడ్డారు.
ఉపాధి–శిక్షణ శాఖ అధికారులు బడ్జెట్ అవసరాలు, కొత్త ప్రతిపాదనలను వివరించారు. ఈఎస్‌ఐ శాఖకు సంబంధించి కార్మికులకు సమయానుకూలంగా, నాణ్యమైన వైద్య సేవలు, మందులు అందించడం తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. గనుల శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించి ఆదాయ వనరులు, రెవెన్యూ సేకరణకు సంబంధించిన వివరాలను సమర్పించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కార్మిక శాఖ కమిషనర్ పామెలా సత్పతి, ఆశాఖ డైరెక్టర్ మిస్ కాంతి వెస్‌లీ, టీజీఎండీసీ డైరెక్టర్ భావేష్ మిశ్రా, గనుల శాఖ కార్యదర్శి ఎన్. శ్రీధర్ మరియు కార్మిక ఉపాధి శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.






