మంత్రి పదవిలో ఏడాది పూర్తి.. ప్రత్యేక పూజలు చేసిన మంత్రి వాకిటి శ్రీహరి

by Batti.Sumithra |

తెలంగాణ పశుసంవర్థక, యువజన, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మంత్రి పదవిలో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం సతీసమేతంగా కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయంను సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

మంత్రి పదవిలో ఏడాది పూర్తి.. ప్రత్యేక పూజలు చేసిన మంత్రి వాకిటి శ్రీహరి
X

దిశ, చంపాపేట్ : తెలంగాణ పశుసంవర్థక, యువజన, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మంత్రి పదవిలో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం సతీసమేతంగా కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయంను సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.లావణ్య ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, సిబ్బంది మంత్రివర్యులకు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి దంపతులు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం ఆలయ వేద పండితులు మంత్రివర్యులకు వేద ఆశీర్వచనాలు అందజేసి, స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను సమర్పించారు. ప్రజాసేవలో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. మంత్రి పదవిలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తి, సంప్రదాయాల సమ్మేళనంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

Next Story