- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మాణ పురోగతి ఆధారంగా ప్రతి సోమవారం బిల్లులు విడుదల: మంత్రి పొంగులేటి
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి అన్నారు.

దిశ, కూసుమంచి: మండలంలోని రాజుపేట, గట్టు సింగారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాల్లో రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర.టిఎస్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. కేవలం ఇళ్ల మంజూరుతోనే బాధ్యత ముగిసిపోయిందని భావించకుండా నిర్మాణ పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రతి సోమవారం బిల్లులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాజుపేట గ్రామంలో వన్నాపురం సుభద్ర, దాసరి భద్రయ్య, కోట వీరారెడ్డి, సండ్ర ఎల్లమ్మ, గట్టు సింగారం గ్రామంలో గుంటి దుర్గా, గుడిపల్లి వెంకట నరసమ్మ, దివ్వల రమేష్, గుడిపల్లి జ్యోతి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజుపేట గ్రామంలో మంజూరైన గృహాల్లో నాలుగు పూర్తయ్యాయని, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని, గట్టు సింగారం గ్రామంలో 19 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటికే 10 ఇళ్లు పూర్తై గృహ ప్రవేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
సుఖ సంతోషాలతో, ఆత్మగౌరవంతో జీవించాలి..
ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ లక్ష్యంతోనే రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామని వెల్లడించారు. అర్హులైన చివరి లబ్ధిదారుడికి కూడా ఇందిరమ్మ ఇల్లు అందే వరకు దశల వారీగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇల్లు లేని పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. నూతనంగా ఇళ్లు నిర్మించుకుని గృహప్రవేశం చేసిన కుటుంబాలకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఇంట్లో సుఖ సంతోషాలతో, ఆత్మగౌరవంతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, సంబంధిత జిల్లా అధికారులు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండలజిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మంకేన వాసు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బజ్జురి వెంకటరెడ్డి, సీడీసీ చైర్మన్ ఎరబోలు సూర్యనారాయణ రెడ్డి, జొన్నలగడ్డ రవి, ఆయా గ్రామాల నాయకులు, గ్రామస్థులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.






