యూరియా కోసం రైతుల ఆందోళన

by Batti.Sumithra |

సదాశివనగర్ రైతువేదికలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు.

యూరియా కోసం రైతుల ఆందోళన
X

దిశ, సదాశివ నగర్ : సదాశివనగర్ రైతువేదికలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. సీరియల్ ప్రకారం యూరియా ఇవ్వడం లేదని, ఇష్టం వచ్చినట్లు ఇస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతులు యూరియా కోసం బుక్ చేసుకున్న యూరియా దొరకడం లేదని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి పడిగాపులు కాసినా యూరియా మాత్రం దొరకడం లేదని ఆన్లైన్ విధానం రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని యూరియా ఆన్లైన్ బుకింగ్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్య తీసుకొని ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న రైతులకు యూరియా బస్తాలు అందే విధంగా కృషి చేయాలన్నారు. యూరియా కోసం రైతులు లైన్లు కట్టిన యూరియా మాత్రం దొరకడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్ ను ఎత్తివేయాలని రైతులు కోరుతున్నారు.

అడ్లూరు ఎల్లారెడ్డిలో..

సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలోని సొసైటీ పరిధిలోని గ్రామాల రైతులకు యూరియా అందకపోవడంతో కొద్దిసేపు ఆందోళన పరిస్థితి ఏర్పడింది. దీంతో సొసైటీ అధికారులు ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వారికి మరో మూడు రోజులు పాటు యూరియాను సప్లై చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులకు కొద్దిగా ఊరట లభించింది. దీని పై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని యూరియా ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న రైతులకు యూరియా అందే విధంగా కృషి చేయాలన్నారు.

ఉత్తనూర్ సొసైటీలో..

సదాశివనగర్ మండలం ఉత్తనూర్ సొసైటీ పరిధిలోని యూరియా కోసం ఉదయం నుంచి రైతులు బారులు తీరారు. రైతులు బారులు తిరినప్పటికీ యూరియా దొరకకపోవడంతో అధికారులతో ఆందోళనకు దిగారు. ఉదయం 5 గంటల నుంచి లైన్ కట్టిన యూరియా మాత్రం దొరకలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్ సిస్టంను ఎత్తివేయాలని రైతులు కోరారు. రైతులు ఆందోళనకు దిగడంతో ఆన్లైన్లో బుక్ చేసుకున్న రైతులకు మరో రెండు రోజుల పాటు యూరియా పంపిణీ చేస్తామన్నారు.

పద్మాజివాడిలో..

సదాశివ నగర్ మండలం పద్మజి వాడి గ్రామ సొసైటీ పరిధిలోని సోమవారం రైతులు యూరియా కోసం రైతులు ఉదయం నుంచి కో-ఆపరేటివ్ సొసైటీ వద్ద వందలాది మంది వరుసలో నిలబడ్డారు. యాప్ లో యూరియా బుకింగ్ అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు నిరాశగా వెనుతిరిగారని చెప్పారు. యాప్ లేకుండా రైతులకు సరిపడా యూరియా బస్తాలను సరఫరా చేయాలన్నారు. అదే విధంగా ఆన్లైన్ లో బుక్ చేసుకున్న రైతులకు రెండు రోజులపాటు యూరియా బస్తాలను అందజేస్తామని రైతులకు నచ్చ చెప్పారు. రైతులకు నచ్చచెప్పడంతో రైతులు శాంతింపచేశారు. మండలంలోని వేరే సొసైటీలో బుకు చేసుకున్న రైతులకు కూడా యూరియాను అందించే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు.

Next Story