సీఎం సభను సక్సెస్ చేయాలి.. కార్యకర్తలను కోరిన మంత్రి

by Web Desk |
సీఎం సభను సక్సెస్ చేయాలి.. కార్యకర్తలను కోరిన మంత్రి
X

దిశ, అమరచింత: ఈ నెల 8న వనపర్తి జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల ప్రాంతంలో నిర్వహించే సీఎం సభను సక్సెస్ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చందు, స్పోర్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డిలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆత్మకూర్ మండల కేంద్రంలోని సాయి తిరుమల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సీఎం సభకు సంబంధించిన కార్యకర్తల సన్నాహక సమావేశానికి ఆయన, ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా లబ్ధిదారులను పెద్ద సంఖ్యలో సభకు తరలించాలని సూచించారు. ఆత్మకూర్, అమరచింత మండలాల నుంచి 17 వేల మందిని తరలిస్తే, జూరాల ప్రాజెక్టుకు డబుల్ రోడ్డు, పర్యాటక కేంద్రంగా ఏర్పాటుకు, సభలోనే సీఎంతో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న 5 వేల మెట్రిక్ టన్నుల గోదాంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవి కుమార్ యాదవ్, రమేష్ ముదిరాజ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Next Story