సమ్మక్క-సారలమ్మ మహా జాతర‌‌పై ‘దిశ’ స్పెషల్ బుక్.. ఆవిష్కరించిన మంత్రి సీతక్క

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-26 05:37:11  IST  )

ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని ‘దిశ’ పత్రిక రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సోమవారం ఆవిష్కరించారు.

సమ్మక్క-సారలమ్మ మహా జాతర‌‌పై ‘దిశ’ స్పెషల్ బుక్.. ఆవిష్కరించిన మంత్రి సీతక్క
X

దిశ, ప్రతినిధి ములుగు: ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని ‘దిశ’ పత్రిక రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మేడారం జాతరపై భక్తులకు అవసరమైన పూర్తి సమాచారంతో ప్రత్యేక సంచికను తీసుకువచ్చిన ‘దిశ’ పత్రిక యాజమాన్యాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

ఈ పుస్తకం భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, జాతర విశేషాలతో పాటు భక్తులకు కావాల్సిన కీలక సమాచారం ఇందులో పొందుపరచడం సంతోషకరమని పేర్కొన్నారు. వార్తలను అందించడంలో ‘దిశ’ పత్రిక ఎప్పుడూ ముందుంటుందని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో దిశ వరంగల్ బ్యూరో ఇంచార్జి పి.సంపత్ రావు, ములుగు జిల్లా ప్రతినిధి శ్రీధర్, రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేంద్ర గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story