- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG PGLCET పరీక్ష రాసిన మంత్రి సీతక్క
తెలంగాణలో సోమవారం జరిగిన TG PGLCET పరీక్షకు మంత్రి సీతక్క హాజరైనట్టు ఉస్మానియా యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : చదువుకోవాలనే బలమైన కోరిక, ఆసక్తి ఉంటే వయసు కానీ, అనుభవిస్తున్న ఉన్నత అధికార హోదా కానీ అస్సలు అడ్డురావని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మరోసారి నిరూపించారు. తెలంగాణలో సోమవారం జరిగిన టీజీ పీజీఎల్‌సెట్ (TG PGLCET) ప్రవేశ పరీక్షకు ఆమె హాజరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని 'కాన్‌స్టిట్యూషన్ లా' విభాగంలో ఎల్‌ఎల్‌ఎమ్ (LLM) చేయడమే లక్ష్యంగా మంత్రి సీతక్క ఈ ప్రవేశ పరీక్ష రాసినట్లు వర్శిటీ అధికారులు అధికారికంగా వెల్లడించారు.
గతంలో నక్సలిజం బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసిన సీతక్క, విద్యపై ఉన్న మక్కువతో నిరంతరం చదువుకుంటూనే ఉన్నారు. ఆమె మొదట పొలిటికల్ సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ (PhD) పూర్తి చేసి డాక్టరేట్ సాధించారు. ఆ తర్వాత ఎల్‌ఎల్‌బీ (LLB) పూర్తి చేసి, 'కార్పొరేట్ లా' లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. అనంతరం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్‌లోనూ, మంత్రి హోదాలో ఉండి కూడా.. చట్టాలపై మరింత పట్టు సాధించడం కోసం ఆమె నిన్న మరోసారి లా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ పరీక్ష రాయడం విశేషం. నిరంతర విద్యార్థిగా ఆమె చూపిస్తున్న ఈ చొరవ, చదువుపై ఉన్న అంకితభావం ప్రస్తుతం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ, అభినందనలు అందుకుంటోంది.






