- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SIR ఓటర్ సవరణ ప్రక్రియను పరిశీలించిన మంత్రి పొన్నం
కోహెడ మండల కేంద్రంలోని ప్రతి ఇంటింటికి జరుగుతున్న ఓటరు సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ పై బిఎల్ఓ, బ్లాక్‌లతో మాట్లాడి, స్వయంగా ఎన్యూమరేషన్ ఫారాలు ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ అందించారు.

దిశ, కోహెడ: కోహెడ మండల కేంద్రంలోని ప్రతి ఇంటింటికి జరుగుతున్న ఓటరు సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ పై బిఎల్ఓ, బ్లాక్‌లతో మాట్లాడి, స్వయంగా ఎన్యూమరేషన్ ఫారాలు ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2002, 2025 ఓటరు జాబితా అనుగుణంగా ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల సవరణ ప్రక్రియ జరుగుతుంది. బిఎల్ఓ లు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారం నింపాలి. మీ ఓటు లిస్ట్‌లో గల్లంతు కాకుండా చూసుకోవాలని తెలిపారు.
2002, 2025 ఓటరు జాబితాకి అనుగుణంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో 60 వేల ఓట్లు తటస్థంగా ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు కోటి ఓట్లు తటస్థంగా ఉన్నాయి తటస్థంగా ఉంటే ఓట్లు పోయినట్టు కాదు మనం ఫారం నింపి ప్రూఫ్స్ చూపెట్టి ఓట్లు పోకుండా చూసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరి ఫారం నింపాలి జూలై 31 న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా పోకుండా బిఎల్ఎ, బిఎల్ఓలు జాగ్రత్తగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఓటు మన ఆయుధం ఒక ఓటు కూడా పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రజలకు ఓటరు సవరణ ప్రక్రియ పై అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.






