- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లాడ మండలంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం తల్లాడ మండలంలో విస్తృతంగా పర్యటించారు.

దిశ, తల్లాడ : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం తల్లాడ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కూడా పాల్గొన్నారు.మొదటగా గొల్లగూడెం గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు సమర్పించారు. అనంతరం గొల్లగూడెంకు చెందిన కాంగ్రెస్ నాయకుడు దొండేటి కేశవరెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తదుపరి తెలగవరం గ్రామంలోని ప్రసిద్ధ కట్ట మైసమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణం సమీపంలో నిర్మిస్తున్న పశ్చిమ ద్వారం, సామవేదం యాగశాలను పరిశీలించారు. తర్వాత కేశవపురం గ్రామానికి చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అక్కడి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రి పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు.






