ఎల్లమ్మ గుడి సమీపంలో వ్యక్తి మృతి

by Taduka Kalyani |

ఆలయ శివారులో వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజాంపేట మండలం నస్కల్లో జరిగింది.

ఎల్లమ్మ గుడి సమీపంలో వ్యక్తి మృతి
X

దిశ, నిజాంపేట: ఆలయ శివారులో వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజాంపేట మండలం నస్కల్లో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దొంతరబోయిన కనకరాజు (36) గ్రామ శివారులో గల ఎల్లమ్మ ఆలయం వద్ద చనిపోయి ఉన్నట్లు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. మృతుడి నోటి వద్ద వాంతులు చేసుకున్న గుర్తులు ఉన్నట్లు గుర్తించారు. మృతుడి భార్య దొంతరబోయిన రేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టడం జరిగిందని ఎస్సై రాజేష్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణానికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడిస్తామని తెలిపారు.

Next Story