మూడో రోజూ వెనక్కి తగ్గని చంద్రబాబు... ఆ ప్రాంతంపై వరాల జల్లు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-05 11:31:25  IST  )

కుప్పంపై సీఎం చంద్రబాబు నాయుడు వరాలు కురిపించారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం వరకూ నీళ్లు తెచ్చినట్లుగానే గాలేరు-నగరి ప్రాజెక్టు నుంచి కూడా తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు...

మూడో రోజూ వెనక్కి తగ్గని చంద్రబాబు... ఆ ప్రాంతంపై వరాల జల్లు
X

దిశ, వెబ్ డెస్క్: కుప్పం(Kuppam)పై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Candhrababu) వరాలు కురిపించారు. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం వరకూ నీళ్లు తెచ్చినట్లుగానే గాలేరు-నగరి ప్రాజెక్టు నుంచి కూడా తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు మూడో రోజు కుప్ప పర్యటన విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ గాలేరు-నగరి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని ప్రాజెక్టులు కుప్పానికి వస్తున్నాయన్నారు. రోడ్లు, కమ్యూనికేషన్ సహా అన్ని రంగాల్లోనూ కుప్పానికి కనెక్టివిటీని పెంచుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

త్వరలోనే..

త్వరలోనే అభివృద్ధి చెందిన కుప్పాన్ని చూడబోతున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులు తీసుకువస్తే అన్ని తాము తెచ్చామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇంత చేస్తున్నా గొడ్డలి పార్టీ తమపై దుష్ప్రచారం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఫండింగ్ ఇచ్చి మరీ తనతో పాటు పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో బూతులు తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆపే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Next Story